1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 సెప్టెంబరు 2023 (19:01 IST)

క్రికెటర్‌ను పెళ్లాడనున్న పూజా హెగ్డే?

Pooja Hegde
నటి పూజా హెగ్డే త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. తమిళం, తెలుగు, హిందీ భాషా చిత్రాల్లో నటిస్తోంది. మాస్క్ సినిమాతో తమిళంలో అడుగుపెట్టింది. తెలుగులోనూ స్టార్ హీరోల సరసన నటించింది. అలాగే దక్షిణాది భాషల్లోనూ మెరిసింది.
 
ప్రస్తుతం పూజా హెగ్డే బాలీవుడ్‌లో చాలా యాక్టివ్‌గా నటించేందుకు సిద్ధమవుతోంది. అంతే కాకుండా పలు వాణిజ్య ప్రకటనలు, ఇతర చిత్రాల్లో నటిస్తోంది. 
 
పూజా హెగ్డే చివరిగా సల్మాన్ ఖాన్ నటించిన కిసికి భాయ్ కిసికి జాన్‌లో కనిపించింది. ఈ సందర్భంగా నటుడు సల్మాన్ ఖాన్‌తో ఆమె ప్రేమలో వున్నట్లు టాక్ వచ్చింది. అయితే ఆ వార్తలను పూజా ఖండించింది. ఇప్పుడు మళ్లీ పూజా పేరు గాసిప్ కాలమ్స్‌లో నిలిచిపోయింది.

నటి పూజా హెగ్డే స్టార్ క్రికెటర్‌తో ప్రేమలో ఉన్నట్లు కొత్త వార్తలు వచ్చాయి. అంతే కాకుండా వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. అయితే క్రికెటర్ వివరాలు కానీ, ఇతర సమాచారం కానీ బయటకు రాలేదు. పూజా హెగ్డే ఇటీవల క్రికెటర్‌తో కలిసి ఒక ప్రైవేట్ ఈవెంట్‌కు హాజరైనట్లు నివేదికలు సూచిస్తున్నాయి.