మహేష్ బాబు నా కొడుకుతో సమానం.. జగపతిబాబు... ఎందుకిలా జరిగింది?
సరిలేరు నీకెవ్వరు సినిమాలో జగపతిబాబు నటించడం లేదని.. మహేష్ బాబుతో విభేధాలు ఏర్పడి ఆయన సినిమాల నుంచి తప్పుకుంటున్నాడన్న ప్రచారం సాగుతోంది. తెలుగు సినీపరిశ్రమలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. మహేష్ బాబు.. జగపతిబాబులకు మధ్య ఎక్కడ గొడవ జరిగిందో అర్థం కాక సరిలేరు నీకెవ్వరు టీం తలలు బద్థలు కొట్టుకుంటోంది. షూటింగ్ ప్రారంభంలోనే ఎందుకు ఇలాంటి ప్రచారం జరుగుతుందో ఆ సినీ టీంకు అస్సలు అర్థం కాలేదు.
ఈ నేపధ్యంలో జగపతిబాబు దీనిపై స్పందించారు. మహేష్ బాబు ఒక మంచి నటుడు. చిన్నప్పటి నుంచి మహేష్ బాబును నేను దగ్గర నుంచి చూస్తున్నా. మహేష్ నా కొడుకుతో సమానం. మహేష్ తండ్రిని నేను దేవుడిగా భావిస్తాను. ఆయన నటన అద్భుతం అని చెప్పారు. కాగా చిత్ర నిర్మాత అనిల్ ఇలా ట్వీట్ చేశారు...