శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: బుధవారం, 14 మార్చి 2018 (15:21 IST)

టెన్ష‌న్‌లో ఎన్టీఆర్..? ఎందుకు?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు. ప్ర‌స్తుతం ప్రి-ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోన్న ఈ సినిమాని ఏప్రిల్ నెలలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. హారిక-హాసిని క్రియేష‌న్స్ సంస్థ ఈ

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు. ప్ర‌స్తుతం ప్రి-ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోన్న ఈ సినిమాని ఏప్రిల్ నెలలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. హారిక-హాసిని క్రియేష‌న్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించ‌నుంది. అయితే... ఈ సినిమా కోసం ఎన్టీఆర్ జిమ్‌లో క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. 
 
ఇంకా చెప్పాలంటే... సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేస్తున్నాడు అని టాక్ వినిపిస్తోంది. ఇటీవ‌ల జిమ్‌లో ఎన్టీఆర్ ఎలా క‌ష్ట‌ప‌డుతున్నాడో తెలిపే స్టిల్స్ బ‌య‌ట‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా లుక్ ఎలా ఉంటుందో బ‌య‌ట‌కు తెలియ‌కూడ‌ద‌నుకుంటున్నాడ‌ట‌. అయితే... ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ సినిమా ఎం.ఎల్.ఎ ఆడియో వేడుక‌కు గెస్ట్ రావాల్సి వుంది. 
 
ఈ వేడుక‌ను క‌ర్నూలులో ఏర్పాటు చేసారు. ఈ ఫంక్ష‌న్‌కి వ‌స్తే ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండ‌బోతుందో తెలిసిపోతుంది. క‌నుక ఈ వేడుక‌కు వెళ్లాలా..? వ‌ద్దా..? అని ఆలోచ‌న‌లో ప‌డ్డాడ‌ట ఎన్టీఆర్. మ‌రి... బ్ర‌ద‌ర్ క‌ళ్యాణ్ రామ్ కోసం ఆడియో వేడుక‌కు ఎన్టీఆర్ వ‌స్తాడో రాడో చూద్దాం.