ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : గురువారం, 14 సెప్టెంబరు 2017 (06:38 IST)

బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన "యుద్ధం శరణం" ... సినీ కెరీర్‌పై చైతూ డైలమా?

టాలీవుడ్ 'మన్మథుడు' అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు, యువ హీరో నాగ చైతన్య అక్కినేని తన సినీ కెరీర్‌పై పునరాలోచనలో పడ్డారు. చైతూ నటించిన తాజా చిత్రం యుద్ధం శరణం చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.

టాలీవుడ్ 'మన్మథుడు' అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు, యువ హీరో నాగ చైతన్య అక్కినేని తన సినీ కెరీర్‌పై పునరాలోచనలో పడ్డారు. చైతూ నటించిన తాజా చిత్రం యుద్ధం శరణం చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. అభిమానుల అంచ‌నాలను ఏ మాత్రం అందుకోలేక‌పోయింది. దీంతో చైతూ ఇప్ప‌డు ఆలోచ‌న‌లో ప‌డ్డాడ‌ట‌. ఇందులోభాగంగా, ఇప్ప‌ట్లో యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ చేయాల‌ని భావించడం లేద‌ట. 
 
నిజానికి 'యుద్ధం శరణం' సినిమా తర్వాత చందూ మొండేటితో కలిసి నాగ చైతన్య మూవీ స్టార్ట్ చేస్తాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ 'యుద్ధం శ‌ర‌ణం' ఫలితంతో ముందుగా మారుతి సినిమా చేయాలనీ, ఆ తర్వాతనే చందూ మొండేటితో 'సవ్యసాచి' చేయాలని చైతూ భావిస్తున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. ఎందుకంటే 'సవ్యసాచి'  సినిమా యాక్షన్ మూవీగా రూపొంద‌నుండ‌గా, మారుతి చిత్రం ఫ్యామిలీ ఎంటర్‌టైన‌ర్‌గా ఉంటుంద‌ని తెలుస్తుంది.