శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 8 జూన్ 2023 (18:39 IST)

నయన గ్లామర్ సీక్రెట్.. విక్కీకి చుక్కలు చూపిస్తోన్న లేడీ సూపర్ స్టార్?

nayanatara_vignesh
దక్షిణాది సూపర్ స్టార్ నయనతార తన గ్లామర్ సీక్రెట్స్‌ను బయటపెట్టింది. దక్షిణాదిన అత్యధిక పారితోషికం పుచ్చుకుంటున్న హీరోయిన్లలో నయనతార ఒకరు. సుదీర్ఘ కాలంగా కెరియర్‌ను కొనసాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో గ్లామర్ సంబంధించిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. 
 
రోజూ ఎనిమిది గంటల పాటు నిద్రించడం వల్లే తాను గ్లామర్‌గా వున్నానని చెప్పింది. జిమ్‌లో వర్కౌట్లు, యోగా చేయడం.. పక్కాగా డైట్ ప్లాన్ చేయడం.. డైట్‌లో ఎలాంటి మార్పులు చేయకుండా కొనసాగించడమే తన గ్లామర్‌కు ప్రధాన కారణమని నయనతార వెల్లడించింది. 
 
ముఖ్యంగా మంచినీళ్లు ఎక్కువగా తాగుతానని.. ఆరోగ్యంగా వుండాలంటే మంచినీటికి మించిన ఔషధం లేదని చెప్పుకొచ్చింది. ఇకపోతే నయనతార తన భర్తకు చాలా ఇబ్బందులు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఆమె సినిమాలు పెడుతూ.. తన కవల పిల్లల బాధ్యతలను పూర్తిగా విఘ్నేశ్‌కు అప్పగించినట్లు సమాచారం. 
 
నయనతార ఎక్కువ సినిమాల కోసం సమయం కేటాయిస్తుంటే విఘ్నేశ్ శివన్ మాత్రం కవలపిల్లల బాధ్యతలు చూసుకుంటూ.. నయనతారను చూసుకుంటూ తన సినిమాలను కూడా ఓ వైపు చూసుకుంటున్నాడని కోలీవుడ్ వర్గాల సమాచారం.