గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (17:05 IST)

నా భర్తకు బట్టతల చాలా బాగుంది అంటున్న రుహానీ శర్మ

రుహానీ శర్మ. ఉత్తరాది హీరోయిన్. చి.ల.సౌ, హిట్, డర్టీ హరి చిత్రాలతో పలకరించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా నూటొక్క జిల్లాల అందగాడు చిత్రంలో నటించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకు వచ్చే పాత్రలు సమ్ థింగ్ స్పెషల్ అంటుంది.
 
ఇకపోతే తన తాజా చిత్రం గురించి చెపుతూ.. తన భర్తకు బట్టతల, దాని చుట్టూనే కథ తిరుగుతుంటుంది. ఇంతటి సున్నిత సమస్య చుట్టూ కథను చక్కగా తీర్చిదిద్దారు దర్శకులు. ఇది చాలా బాగుంది అంటుంది.
 
తనకు సైకో పాత్ర చేయాలని ఎప్పట్నుంచో కోరిక వుందని షాకింగ్ న్యూస్ చెప్పింది. అలాంటి పాత్రతో ఎవరైనా తనను సంప్రదిస్తే అంగీకరిస్తానని అంటోంది. మరి సైకోతో వచ్చే దర్శకుడు ఎవరో చూడాలి.