ఆ విషయంలో నేను నిత్య విద్యార్థినే.. సమంత

జె| Last Updated: గురువారం, 12 సెప్టెంబరు 2019 (15:09 IST)
సినిమాకు తగ్గ పాత్రలో అలా ఒదిగిపోయే తాను ఇంకా నిత్య విద్యార్థినే అంటోంది. నటన ఎంత బాగా తెలిసినా తాను మాత్రం ఇంకా నటన నేర్చుకుంటూనే ఉంటానంటానంటోంది. టాప్ హీరోయిన్లలో ఒకరైన సమంత తన సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయినా టెన్షన్ పడుతూ ఉందట.

సినిమా షూటింగ్ సమయంలో తన నటనను యూనిట్ సభ్యులు మెచ్చుకుంటున్నారా లేదా గమనిస్తూ ఉంటాను. నేను చేసింది బాగుంది అని యూనిట్ సభ్యులు మాటల్లో కాదు వారి ముఖాల్లో చూసి కనిపెట్టేశాను. అప్పుడు నేను ఆ సీన్ బాగా చేశానన్న భావనకు వచ్చేస్తానంటోంది సమంత. ఇక సినిమా రిలీజ్ గురించి చెప్పమంటారా.

నా సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులు ఏ విధంగా అయితే టెన్షన్ పడిపోతూ ఉంటారో అదే విధంగా నేను టెన్షన్ పడతాను. పెళ్ళయిన తరువాత నుంచి చైతు నువ్వు దేనికి టెన్షన్ పడొద్దంటున్నారు. కానీ నాకు టెన్షన్ పడడం మాత్రం మానడం సాధ్యం కావడం లేదంటోంది సమంత.దీనిపై మరింత చదవండి :