శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 13 డిశెంబరు 2019 (15:25 IST)

ప్రభాస్‌తో 'రోబో' శంకర్ రూ.1000 కోట్ల సినిమా (video)

బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ స్టామినా మామూలుగా లేదు. ఎక్కడికో వెళ్లిపోయింది. డార్లింగ్ ఇమేజికి తగ్గట్లు కథను అల్లి చిత్రాన్ని తీసేందుకు సత్తాగల నిర్మాతలు, దర్శకులు ఇప్పుడు లైన్లోకి వచ్చేశారు. దర్శకుడు మరెవరో కాదు... అపరిచితుడు, రోబో, శివాజీ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన శంకర్. ఈయన దర్శకత్వంలో ప్రభాస్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
 
ప్రభాస్ హీరోగా రూ. 1000 కోట్ల భారీ బడ్జెట్టుతో సినిమాను తెరకెక్కించేందుకు హాలీవుడ్ నిర్మాతలు రంగంలోకి దిగారట. దర్శకుడు శంకర్ అయితే ప్రభాస్ హీరోగా చిత్రం అదరగొట్టవచ్చనీ, ఇండియన్ నేటివిటీతో పాటు అంతర్జాతీయ మార్కెట్టును దృష్టిలో పెట్టుకుని శంకర్ కథలను అల్లడంలో దిట్ట కనుక ఆయనతో చేద్దామని అనుకుంటున్నారట. మరి ఈ వార్త నిజమైతే ప్రభాస్ ఫ్యాన్సుకి పండగే.