శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By
Last Modified: బుధవారం, 31 జులై 2019 (15:01 IST)

పూరీ దెబ్బతో నభా నటేశ్ ఆ పని చేసేసింది...

'ఇస్మార్ట్ శంకర్' భారీ విజయం సాధించిన నేపధ్యంలో ఆ చిత్రంలో నటించిన రామ్ తర్వాత నభా నటేశ్‌కి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. తెలంగాణ యాసలో మాట్లాడుతూ అందాలను ఆరబోసి యువతను చిత్తుచిత్తు చేసేసింది. ఇపుడంతా నభా నటేశ్ ఫోటోలను షేర్ చేసుకుంటూ యువత ఆమెకి ఫిదా అయిపోతున్నారు. మరి అంతలా క్రేజ్ వస్తే ఎవరైనా వూరుకుంటారా?
 
నభా నటేశ్ కూడా అదే చేసేసింది. తనకున్న క్రేజ్ దృష్ట్యా తన పారితోషికాన్ని అమాంతం ఆకాశానికి పెంచేసింది. ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి రూ. 30 లక్షలు తీసుకున్న ఈ భామ ఏకంగా తన రేటును రూ. 40 లక్షలకి పెంచేసిందట. తాజాగా ఆమె నటిస్తున్న మరో చిత్రం డిస్కో రాజా కనుక హిట్ అయితే ఆమె రెమ్యునరేషన్ ఎంతకు చేరుకుంటుందోనని టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు.