సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 31 జులై 2019 (12:23 IST)

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు షాక్ ఇచ్చిన ఇస్మార్ట్ శంక‌ర్

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ - డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొందిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఇస్మార్ట్ శంక‌ర్. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే బ్లాక్ బ‌ష్ట‌ర్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తూ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. అయితే... విజ‌య్ దేవ‌ర‌కొండ డియ‌ర్ కామ్రేడ్ మూవీ వ‌చ్చిన త‌ర్వాత ఇస్మార్ట్ శంక‌ర్ క‌లెక్ష‌న్స్ త‌గ్గుతాయి అనుకున్నారు.
 
కానీ.. అంచ‌నాల‌ను తారుమారు చేస్తూ ఇస్మార్ట్ శంక‌ర్ హౌస్‌ఫుల్ క‌లెక్ష‌న్స్‌తో దూసుకెళుతున్నాడు. ఒక్క హైద‌రాబాద్ లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో అన్నిచోట్లా ఇదే ప‌రిస్ధితి. ఇంకా చెప్పాలంటే.. కొన్నిచోట్ల డియ‌ర్ కామ్రేడ్ క‌న్నా ఇస్మార్ట్ శంక‌ర్‌కే ఎక్కువ క‌లెక్ష‌న్స్ ఉన్నాయి. ఏ సెంట‌ర్స్‌లో డియ‌ర్ కామ్రేడ్‌కి క‌లెక్ష‌న్స్ ఉన్నా... బి, సి సెంట‌ర్స్‌లో మాత్రం ఇస్మార్ట్ శంక‌ర్‌దే హ‌వా.
 
ఈ ఇస్మార్ట్ శంక‌ర్ హ‌వా చూస్తుంటే... ఇప్ప‌ట్లో ఆగేలా లేదు. ఇటీవ‌ల ఆంధ్రాలో స‌క్స‌ెస్ టూర్ నిర్వ‌హించిన ఇస్మార్ట్ టీమ్ ఇప్పుడు తెలంగాణ‌లో స‌క్స‌స్ టూర్ నిర్వ‌హిస్తుంది. ఇస్మార్ట్ శంకర్ ఇదే జోరు కంటిన్యూ అయితే... ఫుల్ ర‌న్‌లో ఈ శంక‌ర్ 100 కోట్లు క‌లెక్ట్ చేయ‌డం ఖాయం.