ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 అక్టోబరు 2022 (20:34 IST)

అల్లు అర్జున్ పై శ్రీరెడ్డి కామెంట్స్.. ఆయనొక్కడే అలాంటి వాడట! (video)

srireddy
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై శ్రీరెడ్డి చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యామిలీపై ఆమె చేసిన వ్యాఖ్యలు గతంలో వైరల్ అయ్యాయి.  తాజాగా కేవలం మెగా కుటుంబంలో అల్లు అర్జున్ మాత్రమే తన ప్రతిభతో నటనతో పైకి ఎదిగారని మిగిలిన వారంతా పండిపోయిన పండ్లలా రాలిపోతున్నారని శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
మెగా కుటుంబంలో ఆడపిల్లల జీవితాలు ఏ విధంగా ఉన్నాయో అందరికీ తెలిసిందేనని  శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.  తన మీద ఎన్నో కేసులు పెట్టి బిగ్ బాస్ హౌస్ వంటి వాటిలోకి కూడా రానీయకుండా అడ్డుకున్నారని తెలిపింది. అందుచేతనే యూట్యూబ్ ఛానల్ ద్వారా పలు వీడియోలను తెలియజేస్తూ లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఉంటానని తెలియజేస్తోంది శ్రీరెడ్డి. చేసిన పాపం ఊరకే పోదని.. వాళ్లను కర్మ అనేది వదిలిపెట్టదని శ్రీరెడ్డి కామెంట్లు చేసింది.