సుక్కు - వేణు శ్రీరామ్ మ‌ధ్య‌లో బ‌న్నీ, టెన్ష‌న్లో అల్లు అర‌వింద్..!

bunny
శ్రీ| Last Modified సోమవారం, 6 మే 2019 (20:47 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేష‌న్స్, గీతా ఆర్ట్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. అయితే... ఈ సినిమాతో పాటు బ‌న్నీ సుకుమార్‌తో చేయ‌నున్న సినిమా ఎనౌన్స్ చేసాడు. అలాగే వేణు శ్రీరామ్‌తో చేయ‌నున్న‌ సినిమాని కూడా ఎనౌన్స్ చేసాడు.

త్రివిక్ర‌మ్ త‌ర్వాత వేణు శ్రీరామ్‌తో సినిమా చేయ‌నున్నాడు. ఐకాన్ టైటిల్‌తో రూపొందే ఈ సినిమాకి స్ర్కిప్ట్ రెడీగా ఉంది. అందుచేత ఈ సినిమానే ముందుగా సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నాడు అని వార్త‌లు వ‌చ్చాయి. దీంతో స్పీడు పెంచి సుకుమార్ కూడా త‌న ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేసే ప‌నిలో ప‌డ్డాడ‌ట‌. త్రివిక్ర‌మ్ త‌ర్వాత త‌న సినిమానే చేయాలి అని చెప్పి బ‌న్నీని ఒత్తిడి చేసాడ‌ట‌. అందుక‌నే ఈ నెల 11న ఈ సినిమా ప్రారంభోత్స‌వం చేయ‌నున్నారని స‌మాచారం.

అయితే రెగ్యుల‌ర్ షూటింగ్ మాత్రం జూన్ నుంచి కానీ ఆగ‌ష్టు నుంచి కానీ ప్రారంభం కావ‌చ్చు అంటున్నారు. ఈ విష‌యాలు తెసుకుంటున్న అల్లు అర‌వింద్ స్పీడుగా సెట్స్ పైకి వెళ్లాలి అనే తొంద‌ర‌లో సుకుమార్, వేణు శ్రీరామ్ సినిమాని ఎలా తీస్తారో అని తెగ టెన్ష‌న్ ప‌డుతున్నాడ‌ట‌. అదీ..మ్యాట‌ర్..!దీనిపై మరింత చదవండి :