నిర్మాతపై ఫైరైన సుమంత్... ఏం జరిగింది..?
అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ నటించిన తాజా చిత్రం ఇదం జగత్. ఈ చిత్రం ఈ నెల 28న రిలీజైంది. ఈ చిత్రంలో సుమంత్ డిఫరెంట్ క్యారెక్టర్ పోషించారు. ఇంకా చెప్పాలంటే... ఇప్పటివరకు చేయనటువంటి నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ చేసాడు. దీనిపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. కానీ... ఈ సినిమా ఫరవాలేదనిపించింది కానీ... కలెక్షన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. దీనికి కారణం ఈ సినిమా రిలీజైంది అనేది ఫిల్మ్ సర్కిల్స్‌లోనే సరిగా తెలియదు. ఏమాత్రం పబ్లిసిటీ లేదు.
దీంతో సుమంత్‌కి బాగా కోపం వచ్చిందట. నిర్మాతకు ఓ లేఖ రాసాడట. పబ్లిసిటీ చేయలేనప్పుడు సినిమా తీయడం ఎందుకు..? అంటూ లేఖలో పేర్కొన్నాడట. ఇప్పటివరకు తన సినిమాలకు ఎప్పుడూ ఇంత తక్కువ కలెక్షన్స్ రాలేదనీ, పబ్లిసిటీ చేయలేమని ముందే చెప్పుంటే అది నేనే చూసుకునేవాడిని కదా అని చాలా సీరియస్ అయ్యాడట. సుమంత్ చెప్పిందాంట్లో నిజం ఉంది. కానీ.. ఇప్పుడు తెలుసుకుని ఏం ప్రయోజనం. జరగాల్సింది జరిగిపోయింది. ఇకనైనా సుమంత్ ఆచితూచి అడుగులు వేస్తే బాగుంటుంది.