శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 జూన్ 2021 (11:36 IST)

"సభకు నమస్కారం" అంటోన్న అల్లరి నరేష్

Allari Naresh
అల్లరి సినిమాతో తన ప్రస్థానం మొదలుపెట్టిన నరేష్ ఆ తరువాత వెను తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అల్లరి నరేష్ ప్రస్తుతం నటుడిగా నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నాడు.
 
నరేష్ నటించిన నాంది సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఏకంగా ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు అంటే ఈ సినిమా ఎంత బాగా ఆడిందో అర్థం చేసుకోవచ్చు.. ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నాడు నరేష్.. నేడు అల్లరి నరేష్ పుట్టిన రోజు.. ఈ సందర్భంగా తన 58వ చిత్ర టైటిల్ "సభకు నమస్కారం"ను అనౌన్స్ చేశారు మేకర్స్.
 
 
ఈ చిత్రాన్ని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు. అయితే ఇది కామెడీ సినిమా కాదని నాంది లాగే సీరియస్ సబ్జెక్ట్ ఉంటుంది మునుపెన్నడూ లేని విధంగా ఓ కొత్త విషయాన్ని స్పృశిస్తూ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన సతీష్ మల్లంపాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలియజేశారు.