శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 సెప్టెంబరు 2019 (10:45 IST)

హిందీ జేజెమ్మగా కరీనా కపూర్?

తెలుగులో సూపర్ హిట్ అయిన చిత్రం అరుంధతి, అనుష్క ప్రధానపాత్రధారిగా వచ్చిన ఈచిత్రానికి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించగా, తెలుగులో సంచలనమే సృష్టించింది. ముఖ్యంగా అనుష్క పేరు కాస్త జేజెమ్మగా మారిపోయింది. జేజెమ్మ పాత్రలో అనుష్క నటన అద్భుతం. ఆమె నటనకు ప్రేక్షకుల ఫిదా అయిపోయారు. 
 
ఈ చిత్ర హిందీ రీమేక్ హక్కుల్ని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ సొంతం చేసుకుంది. ప్రస్తుతం హిందీ రీమేక్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో నాయికగా బాలీవుడ్ సందరాంగులు అనుష్కశర్మ, కరీనాకపూర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 
 
నిజానికి తొలుత అనుష్కశర్మను కథానాయికగా అనుకున్నారు. అయితే ఆమె వరుస ప్రాజెక్టులకు కమిటి కావడంతో డేట్స్ కుదరలేదు. దీంతో చిత్ర నిర్మాతలు కరీనాకపూర్‌ను సంప్రదించగా...ఆమె సినిమాలో నటించడానికి సుముఖతను వ్యక్తం చేసిందని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుందని తెలిసింది.