చీర కట్టుకుని బయటికి వెళ్తే.. నా ఎద.. నడుము అందాలను? చిన్మయి
దక్షిణాదిన మీటూపై గళమెత్తిన గాయని చిన్మయికి అడుగడుగునా వేధింపులు తప్పట్లేదు. ఇప్పటికే డబ్బింగ్ ఆర్టిస్ట్ నుంచి ఆమెను తొలగించడంతో పాటు ఆమెను వేధిస్తూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా తన ఫోటోలు పోర్న్ సైట్లలో దర్శనమిస్తున్నాయని చిన్మయి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ప్రముఖ గాయకుడు, రచయిత వైరముత్తుపై చిన్మయి లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసింది.
ఈ వ్యవహారం పెను సంచలనానికి దారి తీసింది. వైరముత్తు చిన్మయి ఆరోపణలను ఖండించినా.. ఆయనపై పలువురు ప్రముఖులు వేధింపుల ఆరోపణలు చేశారు. ఇటీవల చిన్మయి మాట్లాడుతూ.. మీటూపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పింది. మీటూ ఫిర్యాదు చేసినా.. తగిన చర్యలు తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతేగాకుండా మీటూపై మాట్లాడిన పాపానికి నలిగిపోతున్నామని చిన్మయి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి చిన్మయికి ట్వీట్ చేశాడు.
చిన్మయిని ధైర్యవంతురాలని పొగిడాడు. అందమైన మహిళ అంటూ కితాబిచ్చాడు. మహిళలకు మార్గదర్శకమని ప్రశంసలు గుప్పించాడు. అంతటితో ఆగకుండా.. చిన్మయి ఏవైనా కార్యక్రమాలకు వెళ్లేటప్పుడు చీరలో వెళ్లాలని సూచించాడు. ఇందుకు చిన్మయి షాకిచ్చే బదులిచ్చింది. తాను చీరలో బయట కనిపిస్తే.. తనను అభ్యంతరకరంగా ఫోటోలు తీసి.. ఆ ఫోటోలను పోర్న్ సైట్లలో పోస్టు చేస్తున్నారు.
తన ఎద, నడుము అందాలను ఫోటోలను చూసి చాలామంది పురుషులు హస్తప్రయోగంతో తృప్తి పొందినట్లు మెసేజ్‌లు పెడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది. చీర కట్టినా.. జీన్స్ వేసినా తాను భారతీయురాలినని బదులిచ్చింది చిన్మయి.