బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 సెప్టెంబరు 2024 (12:14 IST)

ఔట్ డోర్, ఇంట్లో జానీ మాస్టర్ నాపై లైంగిక దాడి చేశాడు.. యువతి

pawan kalyan, Johnny Master
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాపై అత్యాచారం కేసు నమోదయింది. మహిళపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు అందడంతో రాయదుర్గం స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ జూనియర్ డ్యాన్సర్ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ముంబైలలో ఔట్ డోర్ షూటింగ్స్‌లతో పాటు హైదరాబాద్ నార్సింగిలోని తన ఇంటిలో సైతం తనపై జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక దాడి చేశాడని పేర్కొంది. 
 
గత కొంతకాలంగా జానీ మాస్టర్ టీమ్‌లో తాను కొరియోగ్రాఫర్‌గా చేస్తున్నానని యువతి వెల్లడించింది. అత్యాచారంతో పాటు బెదిరించి కొట్టాడంటూ బాధితురాలు ఫిర్యాదులో ఆరోపించింది. ఇక జానీ మాస్టర్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలపై నార్సింగ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సెక్షన్ 376 రేప్ కేసుతో పాటు క్రిమినల్ బెదిరింపు (506), గాయపరచడం(323) క్లాజ్ (2) సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 
 
ఇకపోతే.. తాజాగా 'తిరుచిట్రంబళం' అనే తమిళ చిత్రానికి గానూ జానీ మాస్టర్ ఇటీవలే ఉత్తమ కొరియోగ్రఫీగా జాతీయ అవార్డును గెలుచుకున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సభ్యుడు కూడా. జానీ మాస్టర్‌పై లైంగిక దాడి ఆరోపణలు రావడం సినీ వర్గాల్లో సంచలనం రేపింది.