శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 2 ఫిబ్రవరి 2019 (22:16 IST)

ఎఫ్ 2 సినిమాని దిల్ రాజు అక్క‌డ కూడా తీస్తాడా.?

విక్ట‌రీ వెంక‌టేష్ - మెగా హీరో వ‌రుణ్ తేజ్ కాంబినేష‌న్లో హ్యాట్రిక్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం ఎఫ్ 2. ఈ సినిమా ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో తెలిసిందే. సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఎఫ్ 2 సినీ పండితుల‌ను సైతం ఆశ్చ‌ర్య‌ప‌రిచేలా త‌క్కువ రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ క‌లెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఇచ్చిన విజ‌యంతో అనిల్ రావిపూడి ఎఫ్ 3 కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఎఫ్ 3లో వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్‌ల‌తో పాటు మరో హీరో కూడా న‌టించ‌నున్నాడట‌. 
 
ఆ హీరో ఎవ‌ర‌నేది త్వర‌లో తెలియ‌చేస్తామ‌ని.. 2021 సంక్రాంతికి ఈ ఎఫ్ 3 రిలీజ్ ప్లాన్ చేస్తున్న‌ట్టు నిర్మాత దిల్ రాజు చెప్పారు. ఎఫ్ 2 చిత్రాన్ని త‌మిళ్, హిందీలో కూడా రీమేక్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఈ మూవీకి సంబంధించి అన్నీ రైట్స్ త‌న ద‌గ్గ‌రే ఉన్నాయ‌ని.. ముంబాయిలో రోజుకు ఇద్ద‌రు హీరోలు ఈ సినిమాని చూస్తున్నారని చెప్పారు. 
 
హిందీలో కూడా ఎఫ్ 2 రీమేక్ ని త‌నే నిర్మిస్తాన‌ని.. అయితే.. వేరే సంస‌స్థ‌తో క‌లిసి నిర్మిస్తాన‌ని దిల్ రాజు అన్నారు. మ‌రి..తెలుగులో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ఎఫ్ 2 త‌మిళ‌, హిందీలో ఎలాంటి విజ‌యాన్ని సాధిస్తుందో చూడాలి.