గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 8 డిశెంబరు 2022 (12:43 IST)

HBD హంసానందిని.. క్యాన్సర్‌ను జయించి మళ్లీ రీ ఎంట్రీ

hamsa nandini
లౌక్యం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది హంస నందిని. తొలి సినిమాతోనే  మంచి గుర్తింపు సంపాదించుకుంది. జక్కన్న తెరకెక్కించిన ఈగ సినిమాతో ఓ రేంజీలో పాపులారిటీ సాధించింది. 
 
పవన్‌తో అత్తారింటికి దారేది చిత్రంలో అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకుంది. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది. 
 
హీరోయిన్‌గా కాకపోయినా ఓ పాటకు కనిపించే హంసానందిని క్యాన్సర్ వ్యాధి నుంచి కోలుకుంది. రొమ్ము క్యాన్సర్‌ ఆమెకు సోకినట్లు వైద్యులు తెలిపారు. హంస గత ఏడాదిన్నరగా క్యాన్సర్ నుంచి కోలుకునేందుకు చికిత్స తీసుకుంది. 
 
గత రెండేళ్ల పాటు క్యాన్సర్ కారణంగా ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్న ఈమె.. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. 
 
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత హంస ఓ సినిమా షూటింగ్‌‌లో పాల్గొంది. తన షూటింగ్ సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియో నెట్టింట్ వైరల్ అవుతున్నాయి. 
 
ఇకపోతే..  హంసా నందిని వంశీ దర్శకత్వంలో వచ్చిన 'అనుమానస్పదం' చిత్రం ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ హంసానందిని పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.