ఆదివారం, 24 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 నవంబరు 2022 (15:48 IST)

నటి రాశిఖన్నా పుట్టిన రోజు.. ఎంత మంచి పనిచేసిందో తెలుసా?

Rashi khanna
నటి రాశిఖన్నా పుట్టిన రోజు. ఈ సందర్భంగా రాశిఖన్నా ఓ మంచి పనిచేసింది. పుట్టినరోజు అంటే చాలామంది కేక్ కట్టింగ్‌లు, వెకేషన్స్‌తో మజా చేసుకుంటారు. అయితే రాశిఖన్నా మాత్రం మొక్కలు నాటింది. మొక్కలు నాటడం తనకు సంతోషాన్నిచ్చే పని అంటూ చెప్పుకొచ్చింది.
 
ప్రతి పుట్టినరోజుకు ఇదే పద్ధతి కొనసాగుతోందని తెలిపింది. ఇంకా మొక్కలు నాటుతున్న ఫోటోలను షేర్ చేశారు. ఇక రాశిఖన్నా ఫోటోలు నెట్టింట వైరల్ అవుతోంది. రాశిఖన్నా ఆలోచనా విధానాన్ని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంకా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
 
ఊహలు గుసగుసలాడే సినిమాతో రాశిఖన్నాతెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగు, తమిళ భాషలతో పాటు బాలీవుడ్ సినిమాలో నటిస్తూ ఎంతో బిజీగా ఉంది.