బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 డిశెంబరు 2022 (13:42 IST)

పవర్ స్టార్ చేతిలో రెండు ప్రాజెక్టులు... ఏంటవి?

pawan kalyan
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ సినిమాకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ ప్రాజెక్టు చేతిలో వుండగానే పవన్ చేతికి మరో రెండు ప్రాజెక్టులు వచ్చాయి. డీవీవీ ఎంటర్టైన్మెంట్ నుంచి ఓ క్రేజ్ అనౌన్స్ మెంట్ వచ్చింది. 
 
అలాగే పవన్-సుజీత్ కాంబోలో మరో సినిమా కూడా తెరకెక్కనుంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. ప్రస్తుతం పవన్ హరిహర వీరమల్లులో నటిస్తున్నాడు. ఈ సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటుంది