పవన్ కళ్యాణ్‌ను ఇంతకుముందెన్నడూ ఇలా చూడలేదు: రేణూ దేశాయ్ (Video)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఇంతకుముందెన్నడూ ఇలా చూడలేదని రేణూ దేశాయ్ అన్నారు. ఇంతకీ ఆమె ఈ కామెంట్ చేసింది దేనిపైనో తెలుసా... పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్. ఈ చిత్రంలో పవన్ లుక్ అదిరిపోయిందని రేణూ దేశాయ్ అన్నారు.
వకీల్ సాబ్ ట్రైలర్ చాలా బాగుంది. న్యాయవాదిగా పవన్ అద్భుతంగా నటించారు. ఇందులో పవన్ ఆటిట్యూడ్ కూడా ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా మీరు వర్జినా అంటూ అబ్బాయిని అడగటం ఆసక్తిని రేకిత్తిస్తోంది. మొత్తమ్మీద ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకున్నదంటూ రేణూ అభిప్రాయపడింది.