ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 24 జులై 2024 (15:53 IST)

తప్పు జరిగితే కాలర్ పట్టి నిలదీయొచ్చు : సందీప్ కిషన్

Sandeep Kishan
Sandeep Kishan
ఏదైనా విషయం జరిగితే చిన్న దాన్ని కొండంత చేయడం పరిపాటి అయింది. నేను రోజుకు యాభైమంది పేదలకు అన్నదానం చేస్తున్నా. సినిమా హీరోగా సాటి హీరోలకు తక్కువగా పారితోషికం తీసుకుంటున్నా ఏ మాత్రం బాధపడలేదు. నిర్మాత బాగుంటే చాలు అనుకునేవాడిని. అలాంటి నామీద ఇటీవల బురద జల్లారు. చిన్నపుడే నాకు చేనై భోజనం పెట్టింది. ఇప్పడు హైదరాబాద్ పెడుతుంది.  అందుకే వివాహ భోజనంబు పెట్టాను.  నేను స్థాపించిన వివాహ భోజనం హోటల్ అన్ని చోట్ల బాగా రన్ అవుతున్నాయి.
 
కానీ సికింద్రాబాద్ లో ఫుడ్ అధికారులు వచ్చినప్పుడు మధ్యాహ్నం రెండు గంటల సమయం. హోటల్ చాలా బిజీగా వుంటుంది. ఆ టైంలో అన్నీ చెక్ చేసినా ఎటువంటి తప్పు దొరకలేదు. ఫైనల్ గా ఓ డబ్బా చూపించి దీనిపై ఎక్సపైరీ డేట్ లేదు అన్నారు. అది చిట్టి ముంతల బియ్యం డబ్బా. అలాగే వంటగదిలో ఓ చోట నీళ్ళు వున్నాయని చెప్పారు. బిజీ టైంలో అక్కడ కొద్దిపాటి నీరు వుండడం సహజం. అక్కడ జరిగింది రెండు శాతం అయితే, వందశాతం తప్పు జరిగిందని కొంతమంది తెగ రాసేశారు. 
 
విశేషం ఏమంటే, ఆ రోజునుంచి హోటల్ బిజినెస్ బాగా అభివ్రుద్ధి చెందింది. మరి ఫుడ్ బాగోకపోతే ఇంత బిజినెస్ రాదుగదా అంటూ.. సందీప్ కిషన్ వివరణ ఇచ్చారు. ఈ శుక్రవారం ఆయన ధనుష్ తో కలిసి నటించిన సినిమా రాయన్ విడుదల సందర్భంగా జరిగిన చర్చా గోష్టిలో ఈ  మాటలు చెప్పారు.