గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 21 జూన్ 2019 (17:35 IST)

సినీ సెలబ్రిటీల యోగా విన్యాసాలు చూడతరమా?

అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను పరస్కరించుకుని అనేక మంది దేశాధినేతలు యోగా విన్యాసాలతో ఆకట్టుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా యోగాసనాలు వేశారు. 
 
అలాగే, పలువురు సినీ సెలబ్రిటీలు కూడా పలు రకాలైన విన్యాసాలు చేస్తూ ఆ ఫోటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ యోగా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలియజేశారు. బాలీవుడ్ హీరోయిన్లు శిల్పా శెట్టి కుంద్రా, మ‌లైకా అరోరాలు ఫిట్నెస్ కోసం ఎల్ల‌ప్పుడు యోగా చేస్తూనే ఉంటారు.
 
అదేవిధంగా బిపాసా బ‌సు, అనుప‌మ్ కేర్, సోనాల్ చౌహ‌న్, వివేక్ ఒబేరాయ్ అభిమానుల‌ని ఉత్తేజ ప‌రిచే పోస్ట్‌ల‌ని షేర్ చేస్తూ యోగా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సెలబ్రిటీల ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
 
కాగా, ప్రధాని నరేంద్ర మోడీ చొరవతో భారతీయ యోగాకు అంతర్జాతీయ గుర్తింపు లభించిన సంగ‌తి తెలిసిందే. 2015 నుంచి ప్రతి ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం 5వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘ‌నంగా నిర్విహించారు.