శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 మే 2021 (12:38 IST)

నా ఫేవరెట్ క్రికెట్ హీరో ఎవరో తెలుసా? రష్మిక మందన

ఛలో, గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన. ఈ అమ్మడి కెరీర్ గ్రాఫ్ రోజురోజుకు పెరుగుతూ పోతుంది. పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూనే తెలుగు, తమిళం, హిందీ భాషలలో క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటుంది. అయితే క్రికెట్‌ని ఎంతగానో ఇష్టపడే రష్మిక ఐపీఎల్‌లో తన ఫేవరేట్ టీంతో పాటు క్రికెటర్ ఎవరో రివీల్ చేసింది.
 
ఐపీఎల్‌ని రెగ్యులర్‌గా చూస్తాను. ఈ ఏడాది కరోనా వలన వాయిదా పడడం బాధ కలిగించింది. తన హోమ్ టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫేవరేట్ టీం అని చెప్పిన రష్మిక, నా ఫేవరేట్ క్రికెటర్ మాజీ కెప్టెన్ ఎస్ ధోని అని పేర్కొంది. అతను వికెట్స్ వెనుక ఉండి జట్టును నడిపించే తీరు నాకు ఎంతో నచ్చుతుంది. క్రీడలలో నా ఆల్ టైం హీరో ధోనీనే అని రష్మిక పేర్కొంది. ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో బన్నీ సరసన పుష్ప అనే సినిమా చేస్తుంది.