జయం' రవి, ‘అరవింద్‌స్వామి’ హన్సిక కాంబినేషన్ బోగన్
జయం' రవి, అరవింద్‌స్వామి హన్సిక కాంబినేషన్ బోగన్ అట. వివరాల్లోకి వెళితే.. అరవింద్ స్వామి, సక్సెస్‌ఫుల్ హీరో జయం రవి, బబ్లీ బ్యూటీ హన్సిక కాంబినేషన్లో తెరకెక్కి తమిళంలో సూపర్ హిట్ టాక్ అందుకున్న బోగన్ చిత్రాన్ని అదే పేరుతో ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి తెలుగు ప్రేక్షకులకి ముందుకు తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే బోగన్ తెలుగు వెర్షన్‌కి సంబంధించిన ట్రైలర్‌తో పాటు సోనీ మ్యూజిక్ ద్వారా విడుదలైన అన్ని వీడియో సాంగ్స్ అటు సోషల్ మీడియాతో పాటు ఇటు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ నేపథ్యంలో బోగన్ (తెలుగు)ను న్యూ ఇయర్ కానుకగా జనవరి 1, 2021న విడుదల చేస్తున్నారు. ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బోగన్ (తెలుగు) భారీ స్థాయిలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా నిర్మాత రామ్ తాళ్లూరి తెలిపారు.
'తని ఒరువన్' తర్వాత 'జయం' రవి, అరవింద్ స్వామి కాంబినేషన్‌లో రూపొంది సూపర్‌హిట్టయిన మరో సినిమానే ఈ 'బోగన్'. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీని డైరెక్టర్ లక్ష్మణ్ రూపొందించారు. హీరోయిన్‌గా హన్సికా మొత్వాని నటించిన ఈ చిత్రంలో నాజర్, పొన్‌వణ్ణన్, నరేన్, అక్షర గౌడ ఇతర పాత్రధారులు. డి. ఇమ్మాన్ సంగీతం సమకూర్చగా, సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.
తారాగణం: జయం రవి, అరవింద్ స్వామి, హన్సికా మొత్వానీ, నాజర్, పొన్‌వణ్ణన్, నరేన్, నాగేంద్రప్రసాద్, వరుణ్, అక్షర గౌడ, సాంకేతిక బృందం: సంభాషణలు: రాజేష్ ఎ. మూర్తి, సాహిత్యం: భువనచంద్ర, గాయనీగాయకులు: సమీర భరద్వాజ్, శ్రీనివాసమూర్తి, సాయినాథ్, అశ్విన్, దీపిక, సంగీతం: డి. ఇమ్మాన్, సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్, కథ- స్క్రీన్ ప్లే - దర్శకత్వం: లక్ష్మణ్, నిర్మాత: రామ్ తాళ్లూరి, బ్యానర్: ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్.