శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 7 జులై 2018 (15:04 IST)

'టాప్' స్థానం కోసం హీరోయిన్ల రాజీ... క్యాస్టింగ్ కౌచ్‌పై జయప్రద

తెలుగు ఇండస్ట్రీని కుదిపేస్తున్న అంశం క్యాస్టింగ్ కౌచ్. ఈ తేనె తుట్టెను నటి శ్రీరెడ్డి కదిపింది. అప్పటి నుంచి అనేక మంది బాధిత హీరోయిన్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అదేసమయంలో పలువురు సీనియర్ నటులు క

తెలుగు ఇండస్ట్రీని కుదిపేస్తున్న అంశం క్యాస్టింగ్ కౌచ్. ఈ తేనె తుట్టెను నటి శ్రీరెడ్డి కదిపింది. అప్పటి నుంచి అనేక మంది బాధిత హీరోయిన్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అదేసమయంలో పలువురు సీనియర్ నటులు కూడా ఈ అంశంపై స్పందించారు.
 
ఈనేపథ్యంలో తెలుగు సీనియర్ హీరోయిన్లలో ఒకరైన జయప్రద క్యాస్టింగ్ కౌచ్ అంశంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ క్యాస్టింగ్ కౌచ్ అనేది ముంబై నుంచి వస్తున్న హీరోయిన్ల వల్లే వెలుగులోకి వచ్చిందని, అంతకుముందు ఇలాంటివి ఎవరికీ తెలియవన్నారు. 
 
ఇదే అంశంపై ఆమె తాజాగా మాట్లాడుతూ, 'క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలేమీ నాకు లేవు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి సినిమాల్లో ఉన్నాను. సినిమా అవకాశాల కోసం నేను ఎవరినీ సంప్రదించలేదు. నా సినిమాలన్నీ విజయాలు సాధించడంతో నాకు ఆ అవసరమే రాలేదన్నారు. 
 
అయితే క్యాస్టింగ్ కౌచ్ అనేది ముంబై వస్తున్న హీరోయిన్ల వల్లే జరుగుతోంది. టాప్ హీరోయిన్లు అయిపోవాలని కొందరు రాజీపడటం వల్లే ఈ క్యాస్టింగ్ కౌచ్ జరుగుతుంది. క్యాస్టింగ్ కౌచ్ పక్కన పెడితే సినిమాల్లోకి రావాలనే కోరిక మాత్రం ఇప్పుడున్న అమ్మాయిల్లోనే కాకుండా, వారి తల్లిదండ్రులలో కూడా పెరుగుతుంది. అందుకే డ్యాన్సులు, నటన వంటివి కూడా నేర్పుతున్నారు అని చెప్పుకొచ్చారు.