శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 17 నవంబరు 2020 (12:21 IST)

ఫోటోలతో అదరగొడుతున్న 'ఒకే ఒక్కడు' కూతురు ఐశ్వర్య అర్జున్

ఒకే ఒక్కడు చిత్రం పేరు చెబితే ఠక్కున గుర్తుకు వస్తారు యాక్షన్ హీరో అర్జున్. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అర్జున్ ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు.

ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ ఇపుడు కన్నడ సినీ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో దూసుకెళుతోంది.
తాజాగా తన కుటుంబ సభ్యులతో దీపావళి పండుగ జరుపుకుంది ఐశ్వర్య. ఈ సందర్భంగా ఆరు బయట ఫోటోలు తీసుకుంది. ఆ ఫోటోలను తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇదిలావుంటే గత జూలై నెలలో ఐశ్వర్యకు కరోనావైరస్ సోకింది. ఆ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది. కొద్దిరోజుల్లోనే కరోనావైరస్ కోరల నుంచి బయటపడింది. ఈ సందర్భంగా తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది.