సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 మే 2022 (11:05 IST)

సమంత-విజయ్ దేవరకొండ సినిమాకు పవన్ టైటిల్?

kushi
kushi
పవర్ స్టార్ పవన్ కల్యాణ్-భూమిక హీరో హీరోయిన్లుగా 2001లో విడుదలైన 'ఖుషీ' సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
 
ప్రస్తుతం ఇదే టైటిల్‌తో కొత్త సినిమా రానుంది. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో ఓ సినిమా పట్టాలెక్కబోతోంది. ఈ నెల 21న ఈ సినిమాను లాంఛ్ చేయనున్నారు. 
 
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన సమంత హీరోయిన్‌గా నటించనుంది. గతంలో ఈ ఇద్దరు కలిసి 'మహానటి' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాలో ఇద్దరివీ సైడ్ క్యారెక్టర్సే. తొలిసారి ఈ ఇద్దరు కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. 
 
ఇక మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఏంటంటే... ఈ సినిమాకు 'ఖుషీ' టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సమంత కశ్మీరీ యువతిగా కనిపించనున్నట్లు చెబుతున్నారు. ఈ నెల 24 లేదా 25 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కశ్మీర్‌లో స్టార్ట్ అవనున్నట్లు తెలుస్తోంది.