గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (11:21 IST)

కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి రూల్స్ రంజన్ డేట్ ఫిక్స్ చేశారు

Kiran Abbavaram and Neha Shetty
Kiran Abbavaram and Neha Shetty
నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్న చిత్రం 'రూల్స్ రంజన్'. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 
 
అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు, ప్రచార చిత్రాల కు అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా విడుదల అయిన సినిమా ట్రైలర్ సగటు సినిమా ప్రేక్షకుడిని వినోదంలో ముంచెత్తింది. 'రూల్స్ రంజన్' నుంచి విడుదల అవుతున్న ప్రతీ ప్రచార చిత్రం  సినిమా చూడాలనే ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. అమ్రిష్ గణేష్ పాటలలోనే కాదు నేపథ్య సంగీతంలో కూడా తన మెరుగైన ప్రతిభ ను కనబరుస్తున్నారు. ప్రతి ఒక్కరూ సినిమా చూసి వినోదం లో తెలియాడాలనే ఉద్దేశ్యం, మరింత మందికి చేరువ కావాలనే సదుద్దేశ్యంతో పూర్తి స్థాయి వినోద భరితంగా రూపొందుతోన్న ఈ చిత్రం ను అక్టోబర్ 6 న  థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు చిత్ర దర్శక, నిర్మాతలు తెలిపారు . 
 
ఈ మేరకు ఆకట్టుకునే నూతన ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది చిత్ర బృందం. చిత్ర కథ, దానికి అనుగుణంగా సాగే సన్నివేశాలు, వాటికి తగ్గట్లుగా సంభాషణలు, వీటన్నింటినీ స్థాయిని పెంచే రీతిలో నేపథ్య సంగీతం, సందర్భ శుద్ధి గా సాగే పాటలు ప్రేక్షకుడిని అమితంగా ఆకట్టుకుంటాయి అని అన్నారు నిర్మాతలు.
 
తారాగణం: కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, అన్నూ కపూర్, అజయ్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, నెల్లూరు సుదర్శన్, గోపరాజు రమణ, అభిమన్యు సింగ్, సిద్ధార్థ్ సేన్