శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 12 మే 2019 (11:29 IST)

ప్రజల్లో మార్పు వస్తేనే అది జరుగుతుంది... మాధవీలత

సినీనటి మాధవీలత బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. తెలుగమ్మాయిగా ఇండస్ట్రీలో మెరవలేకపోయిన మాధవీలత.. ఆపై రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. గుంటూరు బీజేపీ ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన మాధవీలత ఎన్నికల ఫలితాలపై ఆశలు పెట్టుకుంది. దేశంలో కుల, డబ్బు రాజకీయాలు చాలా ఎక్కువని చెప్పుకొచ్చింది. 
 
కులాలకు, డబ్బులకు ప్రజలు స్టిక్ అయిపోతే.. నిజాయితీ కూడిన నాయకులు ఎలా లీడర్లు కాగలరని ప్రశ్నించింది. ఏపీలో అధికారంలోకి వచ్చే పార్టీ ఏదనే దానిపై క్లారిటీ రాలేదని... ఈసారి వైకాపా-టీడీపీ పార్టీల మధ్య గట్టి పోటీ వుందని చెప్పింది. ఇంకా గుంటూరు నుంచి బీజేపీ ఓటు బ్యాంక్ సంపాదించుకుంటుందని వెల్లడించింది. డబ్బులు ఏరులై పారాయని చెప్పింది. 
 
ఏపీలో రాజకీయాల కంటే తెలంగాణలో బెటరని మాధవీ లత తెలిపింది. ప్రజలు ఓటేసేటప్పుడు ఒకటి రెండు సార్లు బాగా ఆలోచించాలని, కులాలకు, నగదుకు అతీతంగా ఓటేయాలని చెప్పింది. ప్రజల్లో మార్పు వస్తేనే నిజాయితీ కలిగిన వ్యక్తి రాజకీయాల్లోకి వస్తారని.. మాధవీలత వ్యాఖ్యానించింది.