సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 1 మే 2018 (11:12 IST)

భరత్ అనే నేను హిట్.. ఫారిన్ ట్రిప్పేసిన ప్రిన్స్.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా ద్వారా హిట్ కొట్టేశారు. భరత్ సినిమాకు ముందు చేసిన రెండు సినిమాలు పట్ కావడంతో భరత్ అనే నేను సినిమాపై మహేష్ బాబు ఆశలు పెట్టుకున్నాడు. దీంతో ఆ సినిమా మహే

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా ద్వారా హిట్ కొట్టేశారు. భరత్ సినిమాకు ముందు చేసిన రెండు సినిమాలు పట్ కావడంతో భరత్ అనే నేను సినిమాపై మహేష్ బాబు ఆశలు పెట్టుకున్నాడు. దీంతో ఆ సినిమా మహేష్‌కు హిట్‌నిచ్చింది. అందువల్లనే ఎప్పుడు లేనంత టెన్షన్‌ను ఈసారి అనుభవించానని మహేశ్ బాబు స్వయంగా తెలిపారు.
 
అలాగే భరత్ అనే నేను సినిమా అంచనాలకి మించి వసూళ్లను సాధించింది. దీంతో రిలాక్స్‌గా మహేష్ బాబు ఫారిన్ ట్రిప్పేశాడు. ఫ్యామిలీతో కలిసి సరదాగా గడపడం కోసం పారిస్ వెళ్లాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ నమ్రత శిరోద్కర్ ఒక ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పారిస్ నుంచి తిరిగొచ్చిన తరువాత, వంశీ పైడిపల్లితో కలిసి మహేశ్ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ ఫోటోలో మహేష్ సితారతో కలిసి వున్నాడు.