ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 3 డిశెంబరు 2021 (20:14 IST)

శ‌స్త్ర చికిత్స కోసం అమెరికా వెళ్ల‌ని మ‌హేష్‌ బాబు, ఇంకా హైద‌రాబాదులోనే, ఎందుకో తెలుసా!

Action still - Sarkarivari pata
తెలుగు సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు అమెరికా వెళ్ళాడు. మోకాలు శ‌స్త్ర చికిత్స కోసం వెళుతున్నార‌ని వార్త‌లు హ‌ల్చ‌ల్ చేశాయి. కానీ వెబ్ దునియాకు వున్న సమాచారం ప్ర‌కారం మ‌హేష్ బాబు ఇంకా హైద‌రాబాద్‌లోనే వున్నారు. మౌంటైన్ డ్యూ (లెమ‌న్ జ్యూస్ బేస్డ్ డ్రింక్) యాడ్‌లో ఆయ‌న పాల్గొన్నారు. అది బ‌య‌ట‌కు వ‌చ్చింది కూడా. దీనితోపాటు ఆయ‌న మ‌రో షోలో పాల్గొంటున్నాడు.
 
విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం మ‌హేష్‌బాబు ఈ రోజే ఆహా! కోసం బాల‌కృష్ణ‌తో `అన్ స్టాబుల్‌` ప్రోగ్రామ్‌లో పాల్గొంటున్నారు. అందుకు సంబంధించిన గ్రౌండ్ వ‌ర్క్ కూడా పూర్త‌యింది. బాల‌కృష్ణ‌తో ఈ కార్య‌క్రమం పూర్తిచేసిన త‌ర్వాత మ‌హేష్‌బాబు అమెరికా వెళ్ళ‌నున్నార‌ని స‌మాచారం.
 
శ‌స్త్ర చికిత్స నిజ‌మేనా!
మ‌హేష్‌బాబు మోకాలుకు శ‌స్త్ర చికిత్స చేయించుకోవాల‌నుకోవ‌డం నిజ‌మే. స‌ర్కారువారి పాట కోసం యాక్ష‌న్ ఎపిసోడ్స్ తీస్తుండ‌గా కాలుకు గాయ‌మైంది. విదేశాల్లోనే ఫైట‌ర్ల‌తో ఆ సీన్స్ తీస్తుండ‌గా రెడ్ కారులో స్పీడుగా వ‌చ్చి కారుడోర్ తీసుకు వ‌చ్చి స్ట‌యిలిష్‌గా వ‌చ్చే సీన్‌ను ఇటీవ‌ల ప్రోమోలో చూసే వుంటారు. 
 
అలా వ‌చ్చి అక్క‌డి ఫైట‌ర్ల‌తో యాక్ష‌న్ సీన్స్ చేస్తుండ‌గా ఎగిరి అక్క‌డ ప్రొక్ల‌యిన్‌ మీద‌కు జంప్ చేయాలి. ఆ స‌మ‌యంలో ఆయ‌న ఎంతో జాగ్ర‌త్త‌లు ఫైట్ మాస్ట‌ర్ తీసుకున్నా పొర‌పాటున కుడికాలు జారి ప్రొక్ల‌యిన్ మీదే ప‌డిపోయార‌ని స‌మాచారం. దాంతో కుడి మోకాలికి తీవ్ర‌మైన బాధ క‌ల‌గ‌డం, ఆ త‌ర్వాత రెస్ట్ తీసుకోవ‌డం జ‌రిగింద‌ని చిత్ర యూనిట్ స‌భ్యుల స‌మాచారం.
 
మొత్తంగా డిసెంబ‌ర్ నెలాఖ‌రుకు మ‌హేష్‌బాబు అమెరికా వెళ్ళ‌నున్నార‌నీ, నూత‌న సంవ‌త్స‌రంలోనూ అక్క‌డే వుంటార‌నీ రెండు నెల‌లు విశ్రాంతి తీసుకుంటార‌ని స‌మాచారం. ఈ ప‌రిణామం బ‌ట్టి స‌ర్కారివారి పాట సంక్రాంతికి విడుద‌ల కావ‌డంలేదు.