శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 నవంబరు 2020 (10:37 IST)

రెడ్ కలర్ జిమ్ డ్రెస్, ఫేస్ మాస్క్‌తో మలైకా.. బాంద్రా వీధుల్లో..?

malaika arora
అందాల భామ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాలుగు పదుల వయస్సులో అమ్మడు అందాలకు ఏమాత్రం కొదువ లేదు. ఎప్పటికప్పుడు అల్ట్రా మోడ్రన్ లుక్‌తో సోషల్ మీడియా‌లో అభిమానులను కనువిందు చేయడమే కాదు యోగా- ఫిట్నెస్ పేరుతో ప్రత్యేక ట్రీట్ ఇస్తోంది. 
 
అర్జున్ కపూర్‌తో లవ్వాయణంలో వున్న మలైకా అరోరా.. తరచూ తాను చేసే యోగా వీడియోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ తన అభిమానులను అలరిస్తోంది. తాజాగా ముంబైలోని బాంద్రా వీధుల్లో నడుస్తూ కెమేరా కంటికి చిక్కింది. 
 
రెడ్ కలర్ జిమ్ డ్రెస్, ఫేస్ మాస్క్‌తో దర్శనమిచ్చింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మలైకా ప్రియుడు అర్జున్ కపూర్ కూడా కోవిడ్ నుంచి కోలుకుని తిరిగి షూటింగ్‌లకు హాజరవుతున్నాడు.