శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 డిశెంబరు 2023 (12:00 IST)

మార్క్ ఆంటోనీ దర్శకుడితో ప్రభు కుమార్తె ఐశ్వర్య పెళ్లి

Adhik Ravichandran
Adhik Ravichandran
దక్షిణాదిన ప్రభు అగ్రనటుడిగా కొనసాగుతున్నాడు. హీరోగా కెరీర్ ప్రారంభించిన ఆయన ప్రస్తుతం తండ్రిగా పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రభుకు విక్రమ్ అనే కుమారుడు, ఐశ్వర్య అనే కుమార్తె ఉన్నారు. ఆయన కుమారుడు విక్రమ్ కూడా తమిళ చిత్రసీమలో చెప్పుకోదగ్గ చిత్రాల్లో నటిస్తున్నారు.  
 
తాజాగా ప్రభు కూతురు ఐశ్వర్య దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌తో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. దీంతో వీరిద్దరూ శుక్రవారం పెళ్లి చేసుకున్నారు. ఐశ్వర్యకి ఇది రెండో పెళ్లి. చెన్నైలో జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
 
జివి ప్రకాష్ కుమార్ నటించిన ‘త్రిష ఇల్లనా నయనతార’ సినిమాతో అధిక్ రవిచంద్రన్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం క్రేజీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు.
 
 ఆదిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన "మార్క్‌ ఆంటోని" మంచి విజయం సాధించింది.