గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 డిశెంబరు 2023 (23:25 IST)

రేవంతన్న కేసీఆర్‌కు థ్యాంక్స్ చెప్పాలి.. రామ్ గోపాల్ వర్మ ట్వీట్ వైరల్

Ram Gopal Varma
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు చాలామంది. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే.. ప్రధాని మోదీ విషెస్‌ చేస్తూ ట్వీట్ చేశారు. ప్రధాని ట్వీట్‌కు స్పందిస్తూ.. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని అంటూ రేవంత్ ట్వీట్ చేశాడు. అందుకు సింహాంలా బిహేవ్ చేశాడంటూ రాంగోపాల్ వర్మ కామెంట్ చేశాడు. 
 
అలాగే కేసీఆర్‌కు నిజంగా సీఎం రేవంత్ రెడ్డి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే బ్రాండ్ న్యూ సెక్రటేరియట్‌ను కట్టించి బహుమతిగా ఇచ్చాడు కాబట్టి అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. 
 
ఆర్జీవి చేసిన ట్వీట్‌కు నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. మీరు చెప్పింది అక్షర సత్యం అంటూ కామెంట్ చేశారు. మరికొందరు ప్రజల సొమ్ముతో కట్టిన భవనం.. అందుకు కేసీఆర్‌కు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.