గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : ఆదివారం, 21 మే 2023 (20:05 IST)

సంగీత దర్శకులు శ్రీ రాజ్ ఆత్మకు శాంతి చేకూరాలి - పవన్ కళ్యాణ్

Pawan Kalyan
Pawan Kalyan
సినీ సంగీత దర్శకులు శ్రీ రాజ్ గారు  కన్నుమూశారని తెలిసి చింతించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. అలనాటి సంగీత దర్శకులు శ్రీ టి.వి.రాజు గారి వారసుడుగా తనదైన బాణీని చూపారు. తన మిత్రుడు శ్రీ కోటి గారితో కలసి రాజ్ - కోటి ద్వయంగా చక్కటి సంగీతం అందించారు.

అన్నయ్య చిరంజీవి గారు నటించిన యముడికి మొగుడు, ఖైదీ నెం.786, త్రినేత్రుడు లాంటి చిత్రాలకు ప్రాచుర్యం పొందిన గీతాలు అందించడంలో శ్రీ రాజ్ గారి భాగస్వామ్యం ఉంది. శ్రీ రాజ్ గారు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అన్నారు. 
 
కాగా, తెలుగు, తమిళ సంగీత దర్శకులు అందరూ నివాళి అర్పించారు. ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ కూడా రాజ్ మృతికి సంతాపాన్ని ప్రకటించింది.