శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By కుమార్
Last Updated : సోమవారం, 1 ఏప్రియల్ 2019 (17:16 IST)

మెగాహీరో సినిమాలో డబ్‌స్మాష్‌ల అమ్మాయి

'ఎఫ్2' విజయంతో దూసుకుపోతున్న వరుణ్ తేజ్ విభిన్న రకమైన సినిమాలను ఎంచుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ప్రాజెక్ట్ "వాల్మీకి". తమిళ సినిమా "జిగర్‌తాండా" సినిమాకు ఇది రీమేక్. తమిళ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌ను బాబీ సిన్హా, ఇంకా హీరోగా సిద్ధార్థ్ నటించారు. మరి మామూలుగా ఎవరైనా అయితే హీరో క్యారెక్టర్‌ను ఎంచుకునేవారు, కానీ వరుణ్ మాత్రం బాబీ చేసిన క్యారెక్టర్‌ను ఎంచుకుని అందుకు తగిన హోంవర్క్ చేసి రంగం సిద్ధం చేసారట.
 
తమిళంలో డబ్‌స్మాష్‌లు చేస్తూ పాపులర్ అయిన మృణాళిని రవి అనే అమ్మాయిని ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేసారట డైరెక్టర్ హరీష్. తమిళంలో సిద్ధార్థ్ చేసిన పాత్రను తెలుగులో కోలీవుడ్ యంగ్ హీరో అధర్వ చేస్తున్న సంగతి తెలిసిందే. అధర్వకు జోడిగా ఈ అమ్మాయి నటించనుంది. ఇప్పటికే మృణాళిని తమిళ పరిశ్రమలో పలు ఆఫర్లను చేజిక్కించుకుంది. దర్శకుడు సుశీంథిరన్ తెరకెక్కిస్తున్న ఛాంపియన్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవల విడుదలైన సూపర్ డీలక్స్ సినిమాలో కూడా మృణాళిని ఓ కీలక పాత్రలో నటించింది.