గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 10 ఫిబ్రవరి 2024 (16:41 IST)

సోలో క్యారెక్టర్ తో రూపొందిన హలో బేబీ పోస్టర్ విడుదల చేసిన నందితా శ్వేత

Hello Baby poster launched Nandita Shweta
Hello Baby poster launched Nandita Shweta
ఎస్ కే ఎం ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా రూపొందించబడిన చిత్రం హలో బేబీ. ఈ చిత్రం యొక్క మోషన్ పోస్టర్ ప్రముఖ నటి నందితా శ్వేత రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సోలో క్యారెక్టర్ తో ఈ చిత్రం రూపొందించడానికి ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి గట్స్ ఉండాలి. ఇలాంటి చిత్రాన్ని ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు. ఇప్పటికే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ లో ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకుంది. ఇలాంటి అవార్డులు, రివార్డ్స్ ఇంకా చాలా ఈ చిత్రానికి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని కొనియాడారు.
 
చిత్ర నిర్మాత  కాండ్రేగుల ఆదినారాయణ మాట్లాడుతూ భారతదేశంలోనే మొదటి హ్యాకింగ్ విత్ సోలో క్యారెక్టర్ తో చేసిన చిత్రమిది. ఈ చిత్రం చేసేటప్పుడు కచ్చితంగా హిట్ అవుతుంది అన్న నమ్మకం కుదిరింది. మా దర్శకుడు రామ్ గోపాల్ రత్నం చాలా అద్భుతంగా ఈ సినిమాని తీర్చిదిద్దారు. మ్యూజిక్ డైరెక్టర్ సుకుమార్ పమ్మి మంచి సంగీతాన్ని అందించారు. చిత్ర కెమెరామెన్ రమణ కె నాయుడు అద్భుతంగా చిత్రాన్ని తీశారు. ఎడిటర్ సాయిరాం తాటిపల్లి అద్భుతమైనటువంటి ఎడిటింగ్ ఎఫెక్ట్ తో, సింగిల్ క్యారెక్టర్ నటించినటువంటి కావ్యకీర్తి అద్భుతమైన నటన తో అతిత్వరలో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది అని అన్నారు.