శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 19 నవంబరు 2021 (17:24 IST)

గౌతమ్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం

Gautam, Subbu Cherukuri, Srujan Yarabolu
పల్లకిలో పెళ్ళికూతురు ఫేమ్ గౌతమ్ హీరోగా కొత్త సినిమా ప్రారంభమైంది. ఎస్ ఒరిజినల్స్ పతాకంపై సృజన్ యరబోలు నిర్మించనున్నారు. ఒక యూనిక్ కాన్సెప్ట్ తో తెరకెక్క బోతున్న ఈ మూవీ తో  సుబ్బు చెరుకూరి దర్శకుడి గా పరిచయం కాబోతున్నారు. యస్ ఒరిజినల్స్ నిర్మాణం లో పదో సినిమా గా రూపొందుతున్న ఈ మూవీ  సర్వైవల్ థ్రిల్లర్ అనే  కొత్త కాన్సెప్ట్ ను తెర మీద పరిచయం చేయబోతుంది.
 
మోనోఫోబియాతో బాధపడుతున్న ఒక అప్ కమింగ్  రచయిత తన జీవితానికి ప్రమాదం ఎర్పడినప్పుడు ఎలా వాటిని అధిగమించి బయటపడ్డాడు అనే కథాంశంతో సరికొత్త అనుభూతి ప్రేక్షకులకు ఇచ్చేలా ఈ సినిమా ఉండబోతోంది.
 
శ్రీరామ్ మడ్డూరి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి కె సంతోష్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. మోహన్ చారి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
గౌతమ్ హీరో గా రూపొందుతున్న ఈ మూవీ కి  విశ్వ క్లాప్ ఇచ్చారు. ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌నున్నాయి.
 
ప్రొడ్యూసర్ : సృజన్ యారబోలు, రచన  దర్శకత్వం : సుబ్బు చెరుకూరి, సినిమాటోగ్రఫీ : మోహన్, మ్యూజిక్ :  శ్రీరామ్ మద్దూరి, ఎడిటర్ : కె. సంతోష్.