శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 8 ఆగస్టు 2021 (16:45 IST)

"వరుడు కావలెను" సాంగ్‌పై వివాదం : చిక్కుల్లో గేయ రచయిత అనంత్ శ్రీరామ్

ఇటీవలి కాలంలో సినీ గేయ రచయితలు తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా యువ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ అలాంటి వివాదంలోనే చిక్కుకున్నారు. ఆయన దేవుడిని కింపరిచేలా పాట రాసినందుకు బీజేపీ మహిళా మోర్చా నేతలు మండిపడుతున్నారు. పైగా, ఇదే అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
యువ హీరో నాగశౌర్య హీరోగా నటిస్తోన్న 'వరుడు కావలెను' అనే సినిమాలోని ఒక పాటలో నాగదేవతను కించపరిచే విధంగా అనంత శ్రీరామ్‌ రచన ఉందని ఆరోపణలు చేశారు. ఈ మేరకు నెల్లూరులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతర శ్రీరామ్‌ రచన హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు బిందూరెడ్డి ఆరోపిస్తున్నారు. 
 
నాగ దేవతను కించ పరిచే విధంగా పాటను రచించిన అనంత శ్రీరామ్‌ పై అలాగే సినిమా బృందంపై చర్యలు తీసుకోవాలని బిందూ రెడ్డి నెల్లూరు పోలీస్‌ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు. కాగా ఇటీవలే 'వరుడు కావలెను' సినిమా నుంచి “దిగు దిగు దిగు నాగ” అనే పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే.