శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 19 సెప్టెంబరు 2022 (14:40 IST)

పదేళ్ల తర్వాత మొగల్తూరుకు ప్రభాస్.. ఎందుకో తెలుసా?

Prabhas
ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఈ నెల 11న అనారోగ్య కారణాలతో హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ నెల 28న మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రభాస్ హాజరవుతున్నట్టు సమాచారం. దీంతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దాదాపు పదేళ్ల తర్వాత తన సొంతూరు మొగల్తూరుకు వెళ్తున్నారు.
 
కృష్ణంరాజు అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ కు వచ్చినప్పుడు కృష్ణంరాజు ఇంటికి వెళ్లి ప్రభాస్‌ను, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు.