శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 నవంబరు 2020 (11:06 IST)

బాలయ్య సరసన కంచె హీరోయిన్..

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో మూడో సినిమా తెరకెక్కుతోంది. బిబి3 వర్కింగ్ టైటిల్‌తో సినిమాను షూట్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని టాక్ నడుస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అలాగే హీరోయిన్ గురించి రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. తెలుగు అమ్మాయి అంజలి ఈ సినిమా హీరోయిన్‌గా నటిస్తుందని వార్తలు వచ్చాయి. 
 
ఆ తర్వాత బాలీవుడ్ బ్యూటీ అంటూ పుకార్లు షికారు చేశాయి. చివరకు మలయాళీ భామ ప్రయాగ మార్టిన్ నటిస్తుందని అంటున్నారు. తాజాగా మరో హీరోయిన్‌ తెరపైకి వచ్చింది. బాలకృష్ణ సరసన హీరోయిన్‌‌గా ప్రగ్యా జైస్వాల్‌ ఖరారైంది. ఇవాళ ఆమె బాలయ్యతో కలిసి రామోజీ ఫిలిం సిటీలోని సెట్‌లోకి అడుగుపెట్టనున్నారు. వీరిద్దరిపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. 
 
ఇప్పటికే ఈ చిత్రంలో సాయేషా, పూర్ణలు నటిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్‌ "కంచె" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. బోయపాటి-బాలయ్య కాంబోలో మూడోసారి వచ్చే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.