నాకు భద్రత లేదు, రజనీకాంత్ హీరోయిన్ రాధికా ఆప్టే (video)
ఆ మధ్య సూపర్ స్టార్ రజినీకాంత్‌కు భార్యగా నటించి అందరినీ మెప్పించింది రాధికా ఆప్టే. తెలుగులోను బాలయ్య సరసన నటించి అభిమానులకు దగ్గరైంది. అలా ఆమె నటించిన అన్ని సినిమాలు విజయాలు సాధించాయని చెప్పలేము గానీ.. నటించిన వాటిలో 25 శాతం మాత్రమే విజయాలు చేకూరాయి.
కానీ రాధికా ఆప్టేకు మాత్రం తెలుగు, తమిళ భాషల్లో అభిమానులు బాగానే ఉన్నారు. అయితే ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ వివాదాల్లో ఉంటుంది రాధికా ఆప్టే. ఈ సారి ఏకంగా వృత్తి భద్రత గురించి మాట్లాడింది. తమ వృత్తిలో ఉద్యోగ భద్రత అన్నదే ఉండదంటోంది రాధికా ఆప్టే.
అవకాశాలు ఎప్పుడుంటాయో.. ఎప్పుడుండవో తెలియదు, మంచి సినిమాల కోసం ఎప్పుడూ ఎదురుచూస్తూనే ఉంటాము. అదే మంచి అవకాశాలు దక్కితే కనుక నటిగా ఇంకొంత కాలం నిలబడతాము అంటోంది రాధికా ఆప్టే. అంతర్జాతీయంగా గుర్తింపు పొందినా వృత్తి రీత్యా అభద్రతత తప్పదన్నది ఆమె అభిప్రాయం. ప్రతిసారీ కొత్త కథలు పట్టుకోవడం.. వాటిలో నటించడం కష్టమంటోంది. అదృష్టవశాత్తు కొన్ని మంచి కథలు దొరుకుతుంటాయని చెబుతోంది.
అయితే ప్రస్తుతం లాక్ డౌన్లో ఉన్న ఈమె అభిమానులతో చాటింగ్ చేస్తూ మరోసారి వివాదాల్లోకి వెళ్ళింది. ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.