గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 మే 2022 (22:20 IST)

ప్రతీ హీరోయినూ ఆ బ్యాచే.. బాంబు పేల్చిన రాధికా ఆప్టే

radhika apte
రక్తచరిత్ర హీరోయిన్ రాధికా ఆప్టే.. టాలీవుడ్ హీరోయిన్లపై సంచలన కామెంట్లు చేసింది. తెలుగులో లెజెండ్, లయన్, తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలిలో నటించి మెప్పించింది. 
 
ఇకపోతే వివాదాస్పదంగా తెరకెక్కిన లస్ట్ స్టోరీస్ సినిమా ద్వారా మరింత పాపులారిటీను సొంతం చేసుకుంది రాధిక ఆప్టే. ప్రస్తుతం బాలీవుడ్‌కి మకాం మార్చి అక్కడ పలు సినిమాలలో నటిస్తూనే.. మరోవైపు పలు వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తోంది.
 
తాజాగా ఓ ఇంటర్వ్యూ‌లో ప్రతి ఒక్క హీరోయిన్ కూడా సర్జరీ బ్యాచే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది రాధికా ఆప్టే. తోటి కథానాయకుల సర్జరీ ముఖాలు చూసి అలసిపోయాను అని తెలుపుతూనే తన జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో సంఘటనలు కూడా ఇంటర్వ్యూ లో భాగంగా వెల్లడించింది. 
 
ఇకపోతే ప్రేక్షకులను మెప్పించ డానికి చాలామంది హీరోయిన్లు ముఖానికి మాత్రానికే కాదు శరీర భాగాలలో కూడా సర్జరీ చేయించుకుంటున్నారని కామెంట్లు చేసింది.