శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: సోమవారం, 27 ఏప్రియల్ 2020 (22:30 IST)

లాక్ డౌన్లో రకుల్ ప్రీత్ సింగ్ ఆ పనిచేస్తోందా?

లాక్ డౌన్‌తో మొత్తం సినిమా షూటింగ్‌లే ఆగిపోయాయి. ఇది అందరికి తెలిసిన విషయమే. హీరోహీరోయిన్లందరూ ఇంట్లోనే ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండే హీరోహీరోయిన్లు ప్రస్తుతం కుటుంబ సభ్యులతో గడుపుతూ ఆ వీడియోలు, ఫోటోలను ఇన్‌స్టాగ్రాం ద్వారా పోస్ట్ చేస్తున్నారు.
 
తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా తను లాక్ డౌన్ సమయంలో ఏం చేస్తున్నానో చెబుతూ ఒక వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో కాస్త వైరల్ అవుతోంది. ఉదయాన్నే లేచిందే కాఫీ తాగి ఆ తరువాత వ్యాయామం చేయడం.. కాసేపు పుస్తకం చదవడం.. మరికొంతసేపు సోషల్ మీడియాకు కేటాయించడం లాంటివి చేస్తోంది.
 
అలాగే ఆస్కార్ అవార్డులు తెచ్చిపెట్టిన సినిమాలు, తనకు నచ్చిన సినిమాలు చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తోందట. అస్సలు ఖాళీ లేకుండా ఎంతో ఇష్టంగా ఇంట్లో తాను గడుపుతున్నట్లు రకుల్ ఆ వీడియోలో చూపించారు. ఈ వీడియోను చూసిన అభిమానులు రకుల్ గ్రేట్ అంటూ సందేశాలు పంపుతున్నారట.