సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 26 జనవరి 2019 (14:52 IST)

కాళ్లు పట్టుకుని లాగడానికే అలా చేశాను.. వర్మ

వివాదాస్పద ట్వీట్లు చేయడంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందుంటాడు. తాజాగా కేఏ పాల్‌పై మండిపడ్డాడు. 2017లో తాజ్ హోటల్‌లో వర్మ తన కాళ్లు పట్టుకున్నారంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇటీవల పేర్కొన్నాడు. 
 
దీనిపై వర్మ స్పందిస్తూ... పాల్ కాళ్లు పట్టుకున్న మాట వాస్తవమేనని.. అయితే ఆయనకు మొక్కడానికి కాదని, కాళ్లు పట్టుకుని లాగడానికని పేర్కొన్నాడు. అలా చేస్తే కిందపడినప్పుడు దెబ్బతిన్న ఆయన మెదడు తిరిగి సెట్ అవుతుందనే ఆశతోనే అలా చేశానని పేర్కొన్నాడు. 
 
అయితే ఆ తర్వాత జీసస్‌ను పంపి ఏమైనా చేస్తాడనే ఉద్దేశంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు వర్మ తెలిపాడు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో కేఏ పాల్‌కు ఒక్కటంటే ఒక్క ఓటు కూడా పడదని వర్మ పేర్కొన్నాడు. 
 
అంతేకాదు, తన ఓటును కూడా తనకు వేసుకోలేడని, ఈ విషయాన్ని జీసస్ తనకు చెప్పాడంటూ వర్మ సెటైర్ వేశాడు.