శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 14 ఏప్రియల్ 2021 (17:56 IST)

రామాయణం 25వ సంవత్సరంలోకి ప్రవేశించింది

Bala ramayanam
రామాయణం లేదా బాల రామాయణం 1997లో అందరూ పిల్లలతో నిర్మించిన పౌరాణిక తెలుగు సినిమా. ఇది గుణశేఖర్ దర్శకత్వంలో మల్లెమాల సుందర రామిరెడ్డి నిర్మించారు. ఇందులో జూనియర్ఎన్.టి.ఆర్ రామునిగా నటించాడు. ఈ చిత్రం భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు . ఉత్తమ బాలల సినిమా గా ఎంపికచేయబడినది. ఏప్రిల్ 14, తేదీకి 24 ఏళ్ళూ పూర్తిచేసుకుని 25 ఏట ప్ర‌వేశించింది. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ ట్వీట్ చేశాడు.ఈ చిత్రం అందరూ బాలనటులతోనే రూపొంది ఆ రోజుల్లో ఓ చరిత్ర సృష్టించింది. ఈ చిత్ర నిర్మాణంలో నిర్మాత ఎమ్.ఎస్.రెడ్డి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చారు. తెలుగువారు గర్వించేలా చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ నాటి మేటి హీరో జూనియర్ యన్టీఆర్ కు ఇది తొలి చిత్రం. ఇక ఈ సినిమాకు జాతీయ అవార్డు కూడా లభించింది. 
 
ఇదిలా వుండ‌గా, రామాయ‌ర‌ణం సినిమా 25ఏట ప్ర‌వేశించడం ప‌ట్ల ఆనందం వ్య‌క్తం చేస్తూ ఆయ‌న సోష‌ల్ మీడియాలో పెట్టారు. ఆ చిత్రానికి  సంగీతం మాధవపెద్ది సురేష్ఎ, ల్.వైద్యనాధన్ నిర్వ‌హించారు. నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరామ్, కె.ఎస్.చిత్ర, జేసుదాసు, ఎస్.జానకి, ఎస్.పి.శైలజ, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, నృత్యాలు పసుమర్తి కృష్ణమూర్తి, గీతరచన మల్లెమాల సుందర రామిరెడ్డి, ఉండేల భుజంగరాయశర్మ (పద్యాలు), సంభాషణలు ఎమ్.వి.ఎస్.హనుమంతరావు, ఛాయాగ్రహణం శేఖర్ వి. జోసఫ్.
 
కాగా, ఈ ఏడాది ఆయ‌న స‌మంత‌తో శాకుంత‌లం సినిమా తెర‌కెక్కిస్తున్నారు. ఇది పౌరాణిక క‌థ‌లోని ఓ భాగానికి చెందిన సినిమా కావ‌డం విశేషం. ఇప్ప‌టికే ఈ సినిమా చిత్రీక‌ర‌ణ అన్న‌పూర్ణ స్టూడియోలో జ‌రుపుకుంటోంది.