గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 12 జనవరి 2019 (14:02 IST)

చంద్ర‌బాబు గెట‌ప్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసిన వ‌ర్మ‌..!

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా సంచ‌ల‌న‌ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి కోణంలో తీస్తున్నారు. దీంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వైశ్రాయ్ హోటల్ ఎపిసోడ్ నుంచి ఎన్టీఆర్ రాజకీయ జీవితంలోని సంచలన అంశాలకు సంబంధించి ఇంతవరకు ఎవరికీ తెలియని విషయాలను రాంగోపాల్ వర్మ బయటపెట్టే అవకాశం ఉందని భావించడమే అందుకు కార‌ణం. ఈ సినిమాలోని లక్ష్మీపార్వతి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ పాత్రలో కన్నడ నటి యజ్ఞ శెట్టి ఆకట్టుకునేలా ఉన్నారు. 
 
ల‌క్ష్మీ పార్వ‌తి గెట‌ప్‌తో పాటు ఎన్టీఆర్ అల్లుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాత్రకు సంబంధించిన ఫోటోలను వర్మ రిలీజ్ చేశారు. చంద్ర‌బాబు గెట‌ప్‌లో అత‌న్ని చూస్తుంటే... అచ్చుగుద్దినట్లు చంద్ర‌బాబు నాయుడులానే భ‌లే ఉన్నాడే అనిపిస్తుంది. ఈ గెట‌ప్‌తో సినిమాపై మరింత హైప్ పెంచారు. ఏపీలోనూ హీట్ పెంచారు. 
 
ఆ పాత్ర తాలూకు పలు భావోద్వేగాలతో కూడిన ఫోటోలను ట్విటర్ ద్వారా షేర్ చేస్తూ.. ‘ఈ ఫొటోలోని వ్యక్తి కళ్లలో ఏదో ఉంది’ అంటూ కామెంట్ పెట్టారు. ఫిబ్ర‌వ‌రిలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. మ‌రి.. బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి సంచ‌ల‌నం సృష్టిస్తుందో చూడాలి.