సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 ఆగస్టు 2022 (10:04 IST)

రామ్ గోపాల్ వర్మ దృష్టిలో నిజమైన స్వాతంత్ర్యం అంటే..?

Ram Gopal Varma
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా స్వాతంత్య్ర దినోత్సవంపై స్పందించారు. పండగ ఏదైనా తనదైన స్టైల్లో అభిమానులకు విషెస్ చెప్తూ వుండే వర్మ తాజాగా స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా స్వాతంత్య్రానికి కొత్త నిర్వచనం చెప్పుకొచ్చాడు. ఆగస్టు 15 అంటే ఎవ్వరైనా ఇదే నిర్వచనం ఇస్తారు.. అయితే వర్మ దృష్టిలో స్వాతంత్య్రం అంటే వేరు అని చెప్పుకొచ్చాడు.
 
నిజమైన స్వాతంత్య్రం అంటే భార్యల నుంచి భర్తలు స్వాతంత్య్రం పొందడం.. బోరింగ్ భర్తల నుంచి భార్యలు స్వాతంత్య్రం పొందడం.. చికాకు కలిగించే తల్లిదండ్రుల నుండి పిల్లలు స్వాతంత్య్రం పొందడమే' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ ట్వీట్‌పై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.